ఛలో కొత్తకొండ.. గౌరవెల్లి నీళ్ల కోసం మహా పాదయాత్ర.

గౌరవెల్లి నీటిని వెంటనే రైతులకు అందించాలి: బీజేపీ.

భీమదేవరపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

గౌరవెల్లి ప్రాజెక్టు నీటిని వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ భీమదేవరపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో ‘ఛలో కొత్తకొండ’ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 9 గంటలకు ముల్కనూర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం రైతులు దాదాపు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీలు ఇచ్చినా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే మూడేళ్లు గడుస్తున్నా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.

“రైతుల సహనాన్ని పరీక్షించొద్దు.. గౌరవెల్లి నీటిని వెంటనే విడుదల చేయాలి. రైతులకు సాగునీరు అందే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది” అని శ్రీరామోజు శ్రీనివాస్ స్పష్టం చేశారు.

భీమదేవరపల్లి మండల రైతుల దీర్ఘకాలిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మహా పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. రైతులు, రైతు నాయకులు, మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల కుమార్, జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దొంగల రాణాప్రతాప్, దొంగల వేణు, బొల్లంపెల్లి శ్యామ్, గిరబోయిన అరుణ, లక్కిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!