పాఠశాల విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ .

పాఠశాల విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ .

వేలేరు, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత (జెడ్పీ) పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షూస్‌ను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా షూస్ అందజేస్తోందన్నారు. ఇందులో భాగంగా వేలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 218 మంది విద్యార్థులు ఉండగా, మొదటి విడతలో 120 మంది విద్యార్థులకు షూస్ అందాయని, వాటిని విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా  ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం పలు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల శాతాన్ని పెంచేందుకు ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో వేలేరు మండల విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించడం ఆనందదాయకమని, ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను సర్పంచ్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, ప్రధానోపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!