అంగన్వాడీ సేవలకు గౌరవం.. చిన్నారుల ఆరోగ్యానికి భరోసా.

అంగన్వాడీ సేవలకు గౌరవం.. చిన్నారుల ఆరోగ్యానికి భరోసా.

ఎల్కతుర్తి అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా దామెర గ్రామంలో ‘అంగన్ మిలాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దామెర గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఘనంగా సన్మానించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ, ప్రాథమిక విద్యలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను నాయకులు అభినందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. బాలల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, బాలల అభివృద్ధి తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. సమాజానికి వివిధ రూపాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి గౌరవించడం సేవా సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చీదురాల వెంకటేష్, కార్యదర్శి చిర్ర శ్రీనివాస్, హింగే దేవరావు, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, కూడుతడి రాజు, ఠాకూర్ శామ్ సింగ్, ఎడ్ల రగోతం రెడ్డి, మద్దె అనిల్, గొర్రె ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత, రమ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!