బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
బంగారు పద్మాలతో వైభవంగా పూజలు.
చిల్పూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని ప్రసిద్ధ చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బంగారు పద్మాలతో స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, కిరణ్మయి దంపతులు రూ.516 చెల్లించి పూజలో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జూనియర్ సహాయకుడు సీహెచ్ రాజేందర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు బి.రవీందర్ శర్మ, సౌమిత్రి రంగాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Comments