ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి,అక్టోబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి దొరబాయిమిట్ట సమీపంలో ఆర్‌టీసీ డీలక్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో మృతి చెందిన కొండ వనజ కుటుంబ సభ్యులను, గాయపడి జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు.9వ వార్డుకు చెందిన భేడ, బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన పలువురు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొండ వనజ మృతి చెందగా, కొండ సుహాసిని కోమాలో ఉన్నారు. గుగ్గిల నారాయణమ్మతో పాటు చిన్నారులు నంద కిషోర్, అక్షయ, మీనాక్షి, శంకర్ తీవ్రంగా గాయపడి జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అనంతరం మృతురాలు కొండ వనజ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.ప్రమాదంలో బాధితులైన పేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్, దేవర్ల నరసింహ, బాబు నాయక్, మర్రికుంట శ్రీను, శిరివాటి శంకర తదితరులు పాల్గొన్నారు.


Comments