పెద్దమందడిలో కాంగ్రెస్ నుంచి భారీగా బీఆర్‌ఎస్‌లో చేరికలు.

పెద్దమందడిలో కాంగ్రెస్ నుంచి భారీగా బీఆర్‌ఎస్‌లో చేరికలు.

పెద్దమందడి,అక్టోబర్06(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని స్కూల్‌ తండా గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో వారు బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకున్నారు.బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో గ్రామ యువజన అధ్యక్షుడు రాకేష్‌, శీను, లచ్చ, రమేష్‌, చతురు, నారమ్మ, ముత్యాలమ్మ, నిజామా, నరేష్‌ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా గ్రామ యువజన అధ్యక్షుడు రాకేష్‌ మాట్లాడుతూ, గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి గతంలో అమలు చేసిన పథకాలపై విశ్వాసంతో బీఆర్‌ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు.అలాగే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని రాకేష్‌ విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!