వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.

ఖర్చుల లెక్కలపై కౌన్సిలర్ల ఫైర్‌.. సర్దిచెప్పిన చైర్మన్‌

వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ అత్యవసర సమావేశం మంగళవారం వాడివేడిగా సాగింది. బోనాల ఖర్చుల లెక్కల నుంచి దసరా పండుగ ఏర్పాట్ల వరకు పలు అంశాలపై కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించడంతో సమావేశంలో కొంతసేపు వేడివేడి చర్చ జరిగింది.నాలుగో వార్డు కౌన్సిలర్ రాజేశ్వర్ మాట్లాడుతూ బోనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేశారు, ఏయే పనులకు ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా మున్సిపాలిటీకి సంబంధించిన ఖర్చుల పట్టికను కౌన్సిలర్లకు అందించాలని పట్టుబట్టారు.
దసరా పండుగ సందర్భంగా దాతల సహకారంతో 35 అడుగుల భారీ రావణాసురుడి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని 14వ వార్డు కౌన్సిలర్ పెసర కృష్ణవేణి తెలిపారు. ప్రతిమ ఏర్పాటు చేసే ప్రాంతంలో విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.కౌన్సిలర్లు పొన్న రాజేష్, బలగాని అనిల్, తాటికొండ మధుతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ చాగల్లు, శివునిపల్లి సహా అన్ని వార్డుల్లో బతుకమ్మ, రావణాసుర వధ కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, ధ్వని పరికరాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.
సమావేశంలో వాతావరణం వేడెక్కడంతో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ కల్పించుకుని సభ్యులను సముదాయించారు. పండుగ వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అన్ని వార్డుల్లో విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య చర్యలు, ధ్వని పరికరాల ఏర్పాట్లకు మున్సిపల్ కమిషనర్‌కు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో సమావేశం సద్దుమణిగింది.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్‌చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాథ్, చౌదరపల్లి సంపత్, గట్టు సంగీత రమేష్, పొన్నం స్వరూప రాజయ్య, అంగడి రజిత కృష్ణ, బొల్లు లక్ష్మి, తోకల అనూష రాజు, గుర్రం హైమావతి రమేష్, చల్ల రమ్య రఘురెడ్డి, సహచర సభ్యులు గన్ను నరసింహులు, మాషూక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!