రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం.

రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం.

చిల్పూర్,అక్టోబర్06(తెలంగాణ ముచ్చట్లు): 

జనగామ జిల్లాలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో రెండు రోజుల క్రితం గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పడాల కల్యాణ్ (26) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది.వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌కు వచ్చిన కల్యాణ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.రెండు రోజుల పాటు గాలింపు చర్యలు కొనసాగించిన అనంతరం మంగళవారం ఉదయం కల్యాణ్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్యాణ్ మృతితో రిజర్వాయర్ పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!