ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.

వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి

జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు): 

విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు అవసరానికి అనుగుణంగా విద్యుత్‌ను వినియోగిస్తూ పొదుపు పాటించాలని వరంగల్‌ విద్యుత్‌ శాఖ పర్యవేక్షణ ఇంజినీర్‌, జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ సూచించారు.మంగళవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్‌ నిల్వ, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్‌ శాఖ ఉపవిభాగ ఇంజినీర్లు విజయ్‌కుమార్‌, బి.సారయ్యతో కలిసి పనుల పురోగతిని, అక్కడ ఏర్పాటు చేస్తున్న పరికరాలను పరిశీలించారు.కేంద్రం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించడమే లక్ష్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేసి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలని పేర్కొన్నారు.

స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మీటర్లకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సహాయ విభాగ ఇంజినీర్‌ పి.రణధీర్‌రెడ్డి, సహాయ ఇంజినీర్లు సుమన్‌, శ్వేత, శంకర్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!