420 హామీలు.. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది.

హామీలు అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులు: రసమయి బాలకిషన్.

420 హామీలు.. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది.

ఇల్లంతకుంట, అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు ):

పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యే తన ప్రయాణం కొనసాగుతుందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి, గాలిపెల్లి, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయా గ్రామాల్లో వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పదవులు వస్తాయి, పోతాయి కానీ ప్రజలతో ఉన్న అనుబంధం, నమ్మకం శాశ్వతంగా ఉంటాయని అన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడమే తన లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. హామీల అమలును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. బోర్లు, బావుల్లో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. పంట పొట్ట దశలో నీరు అత్యవసరమని, అదే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని పేర్కొంటూ, ప్రస్తుతం కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఇల్లంతకుంట మండల అధ్యIMG-20261006-WA0013క్షుడు పల్లె నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!