47వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
₹10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం.
Views: 0
On
కరీంనగర్, అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 47వ డివిజన్ శ్రీహరి నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ గాజ రమ-శివరాంతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Oct 2026 21:46:50
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి
జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):
విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...


Comments