ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి.
వరంగల్,అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 29వ డివిజన్ రాజీవ్ గాంధీ రామన్నపేటలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రాన్ని మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ 29వ డివిజన్ పరిధిలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు కేంద్రానికి వచ్చి నమోదు చేసుకోవడంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కన్వీనర్లు, బూత్ స్థాయి ఏజెంట్ల వద్ద కూడా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సిద్ధాంత్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడిచర్ల ప్రసాద్, రాచర్ల రాము, ఎండీ షఫీ, తాళ్లపల్లి రమేష్, రాచర్ల జగన్, గట్టు చందు, పూజారి కుమారస్వామి, ఇజగిరి భీమరాజ్, మాల్వే రాజు, బుస శేఖర్, ఎండీ జావిద్, ఎస్‌కే రహమాన్, నాగమణి, పూజారి
సారంగం, సూరం గోపి, వెంకన్న, కొండ శ్రీనివాస్, ముప్పకాంతయ్య, వడిచర్ల దత్తు, బుస రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments