టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.
కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా.. ఏకగ్రీవంగా ఎంపిక.
హుజూరాబాద్,అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావును కార్మిక నాయకులు ఏకగ్రీవంగా నియమించారు. బుధవారం హుజూరాబాద్ బస్ డిపో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పుల్లారి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి యూనియన్ నాయకులతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.
కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర హక్కుల సాధన కోసం యూనియన్ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో యూనియన్లు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో టీఎంయూ యూనియన్ గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు జీ. శ్రీనివాస్‌రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షులు ఎం. రమేష్, సీనియర్ నాయకులు కే. చక్రపాణి, ఏ. శ్రీనివాస్, టీ. శ్రీనివాస్, కే. అశోక్‌బాబు, ఏపీ రాజు, ఎన్
. రవి, టీ. మహేష్, ఏపీ భాస్కర్, ఆర్. కిరణ్, ఎంవీఎస్ రెడ్డి, డిపో మెకానిక్ తదితరులు పాల్గొన్నారు.


Comments