ఇండియన్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గానికి ఘన సత్కారం.

సమాజ సేవలో రెడ్ క్రాస్ పాత్ర అభినందనీయం: అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.

ఇండియన్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గానికి ఘన సత్కారం.

కరీంనగర్, అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):

సమాజ సేవలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు.

స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవల ద్వారా ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నూతన కార్యవర్గం చేపట్టే పలు సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలవాలని నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన అధ్యక్షులుగా సంఘం లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, కోశాధికారిగా జి. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కే. మహేశ్వర్, ఎ. మునిందర్, సిహెచ్. సురేష్, కే. అన్నారెడ్డి, కే. మనోహర్ రావు, ఆర్. శ్రీనివాస్, ఎం. రాకేష్, పి. విద్యాసాగర్, హనుమండ్ల రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.