ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం..

ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం..

*సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.* 

*కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు.*

హుజురాబాద్,అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):

ఓటరు జాబితాల సవరణ పేరుతో దేశంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే పరిస్థితులు నెలకొంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు అన్నారు.ఓటర్ల హక్కులపై ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆయన తీవ్రంగా ఖండించారు.

బుధవారం సందమల్ల బాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం.ఆ ఓటు హక్కుకు సంబంధించిన అనుమానాలు, సందేహాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదు’’ అని బాబు అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉందని, ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమగ్రంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం ఒక కాపలాదారు. కానీ అదే వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే పరిస్థితి రావడం ఆందోళనకరం.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు.ఈ ఆరోపణలపై ఆయన ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు.జ్ఞానేష్ కుమార్ సిఈసి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదని బాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, ఆ హక్కును అణచివేసేందుకు అరెస్టులు, నిర్బంధాలను ఉపయోగించడం సరైన విధానం కాదని బాబు అన్నారు. ‘‘రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడం ద్వారా వారి గొంతును అణచివేయలేరు.దేశ ప్రజల గొంతుకను కూడా అణచివేయ లేరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ఎవరూ కాలరాయలేరు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని సందమల్ల బాబు డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల సవరణ నుంచి ఎన్నికల ఫలితాల వరకు ప్రతి దశలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఓటు హక్కు బలంగా ఉండాలి. ఓటు హక్కు బలంగా ఉండాలంటే ఓటరు జాబితాలు పారదర్శకంగా ఉండాలి. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలి.ఈ మూడు అంశాల్లో ఎక్కడైనా అనుమానం తలెత్తితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది.అందుకే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుంది’’ అని సందమల్ల బాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాసి బాబు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.