కొత్తకొండ ఆలయ అభివృద్ధికి రూ.3.80 కోట్ల నిధులు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నిధుల మంజూరు.

కొత్తకొండ ఆలయ అభివృద్ధికి రూ.3.80 కోట్ల నిధులు.

భీమదేవరపల్లి, అక్టోబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని ప్రముఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.3.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ, నిరంతర సహకారంతో ఈ నిధులు మంజూరైనట్లు భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి తెలిపారు.

కొత్తకొండ దేవస్థానం అభివృద్ధి అవసరాలను గుర్తించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని రాజిరెడ్డి పేర్కొన్నారు. రూ.3.80 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంజూరైన నిధులతో ఆలయ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి రానుంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చెంది, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరించాలని రాజిరెడ్డి ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.