దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!

ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు.

దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ 9వ వార్డులో దోమల నివారణ చర్యలు చేపట్టారు. వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని గుర్తించిన కౌన్సిలర్, విప్ సంపత్ రాజ్ వెంటనే స్పందించి బుధవారం ప్రతి వీధిలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా సంపత్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ లక్ష్యమని, ప్రజా సమస్యే తమ సమస్యగా భావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.కౌన్సిలర్ చొరవతో వార్డులో ఫాగింగ్ చేపట్టడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, విప్ సంపత్ రాజ్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.