రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.

విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది

– స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు): 

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేందుకు నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నించేందుకు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విపక్ష నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని, విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే అరెస్టులకు పాల్పడ్డారని రడపాక దానియేల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, విపక్ష నేతలపై నిర్బంధ చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగిస్తుందని రడపాక దానియేల్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.