ఖాసింపేటలో వీఓ భవనం ప్రారంభం.
*ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ*
మానకొండూర్, అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన వీఓ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన భవనం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, సమీపంలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల సౌకర్యాల కోసం చేపడుతున్న పనులను వేగవంతం చేస్తామని, ఖాసింపేట గ్రామ ప్రజల అవసరాల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించి, వారి అభ్యసన పరిస్థితులను తెలుసుకున్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


Comments