ప్రజాసేవలో రెడ్‌క్రాస్ మరింత ముందుకు సాగాలి.
మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి.
వనపర్తి,అక్టోబర్07(తెలంగాణ ముచ్చట్ల):
జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులను మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా పోతుల అమరేందర్, వైస్ చైర్మన్‌గా డాక్టర్ ప్రియాంక, స్టేట్ ఎంసీఎల్‌గా స్వామి, కోశాధికారిగా విష్ణువర్ధన్, కార్యవర్గ సభ్యుడు అరవింద్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో రెడ్‌క్రాస్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. రక్తదాన కార్యక్రమాలు, వైద్య సేవలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో చేపట్టే సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.సేవా కార్యక్రమాల్లో యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని జిల్లా నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా పోతుల అమరేందర్ విజయవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేస్తూ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలని ఆయన సూచించారు.


Comments