మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు ఘన నివాళి.
*వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రలో బీజేపీ శ్రేణుల ఉత్సాహం**
*పార్టీ జాతీయ అధ్యక్షుడి సందేశం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం*
*భారీగా తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు*
కరీంనగర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల సుదీర్ఘ, నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు వర్చువల్ విధానంలో అందించిన సందేశాన్ని కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రతి కార్యకర్తకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
బండి సంజయ్ కుమార్ పాల్గొనడంతో కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రజాసేవే బీజేపీ లక్ష్యమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బండారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షులు శ్రీ సాయిని మల్లేశం, కరీంనగర్ మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీ యాదగిరి సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments