కేఎల్‌ఐ పంపులు నిర్విరామంగా నడిపి రైతులను ఆదుకోవాలి.

కేఎల్‌ఐ పంపులు నిర్విరామంగా నడిపి రైతులను ఆదుకోవాలి.

నార్లపూర్ పంపులు ప్రారంభించకపోతే 12న వేలాది మంది రైతులతో ముట్టడి

--మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,అక్టోబర్07( తెలంగాణ ముచ్చట్లు): 

కేఎల్‌ఐ పంపులను నిర్విరామంగా నడిపి, జూరాల నుంచి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నార్లపూర్ పంపులను వెంటనే ప్రారంభించకపోతే ఈ నెల 12న వేలాది మంది రైతులతో కలిసి ముట్టడి చేపడతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూరాలలో నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేఎల్‌ఐ పంపులు సక్రమంగా పనిచేయకపోవడం, జూరాల నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్షలాది ఎకరాల పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పంటలు చివరి దశలో ఉన్నందున ప్రస్తుతం సాగునీరు అత్యవసరమని, కేఎల్‌ఐ పంపులను సమర్థంగా నిర్వహించి చెరువులు, వాగులు, వంకలకు నీటిని అందించాలని కోరారు. జూరాలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కరెంటు కోతలు, నిర్వహణ లోపాల కారణంగా కేఎల్‌ఐ మోటార్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని మూడు దశల్లో నీటి నిర్వహణ చేపట్టి పంటలను కాపాడాలని ఆయన కోరారు. నార్లపూర్ పంపులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

*ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం*

తనపై చేస్తున్న భూకబ్జా, ఆస్తులకు సంబంధించిన ఆరోపణలపై కూడా నిరంజన్‌రెడ్డి స్పందించారు. తన ఆస్తులన్నీ చట్టబద్ధంగా, కష్టపడి సంపాదించుకున్నవేనని తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు అధికారులను, కలెక్టర్లను, రాష్ట్ర మీడియా ప్రతినిధులను తీసుకుని బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.తనపై చేసిన ఆరోపణల్లో ఏదైనా వాస్తవమని రుజువైతే తాను బహిరంగంగా క్షమాపణ చెబుతానని అన్నారు. పానగల్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చి తనపై ఆరోపణలు చేయించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తనపై వ్యక్తిగత ఆరోపణలు, దుష్ప్రచారం చేయడం తగదని నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు, విద్యుత్, ఎరువులు, రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గట్టు యాదవ్, బి. లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్, కృష్ణా నాయక్, మాణిక్యం, వనం రాములు, రాళ్ల కృష్ణయ్య, గంధం పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.