దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఘన్‌పూర్!
35 అడుగుల భారీ రావణాసురుడి దహనానికి భూమిపూజ
పండగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని 14వ వార్డులో ఉన్న క్రీడా ప్రాంగణంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రావణాసుర దహన కార్యక్రమానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు.
కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య ఆధ్వర్యంలో జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, ఎస్సై రాజేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సుమారు 35 అడుగుల భారీ రావణాసురుడి ప్రతిమను ఏర్పాటు చేసి దహనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పండగ వాతావరణం ఉట్టిపడేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్లు గట్టు సంగీత రమేష్, పొన్నం స్వరూప రాజయ్య, గుర్రం హైమావతి రమేష్, వ్యాపారవేత్తలు, ప్రముఖులు బోనగిరి విద్యాసాగర్, కోఆప్షన్ సభ్యురాలు బూర్ల లత శంకర్, పట్టణ అధికార ప్రతినిధి పోశాల కృష్ణ, దిండి సత్యం, గోపాల్, దిలీప్, రామాచారి, గడ్డాల శేఖర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


Comments