సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకం.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకం.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 9(తెలంగాణ ముచ్చట్లు )

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకమని పోIMG-20261009-WA0049లీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకు అధికారులమని ఫోన్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం, నకిలీ లింకులు పంపడం, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపించడం, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

కొందరు వ్యక్తులు పోలీసులమని, ఇతర ప్రభుత్వ అధికారులమని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి డబ్బులు పంపవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం, ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవడం, అనధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, రెండు దశల ధృవీకరణ (టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్) సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

కళాశాల విద్యార్థులు తమకు తెలిసిన సైబర్ భద్రతా అంశాలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన లేని కుటుంబ సభ్యులకు తగిన సూచనలు చేయాలని అన్నారు. సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్  వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సదస్సులో సైబర్ సెక్యూరిటీ విభాగ ఏసీపీ ఫణింద్ర, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట చలపతి, ఖమ్మం రూరల్ కూసుమంచి, నెలకొండపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్లు, సబ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, కళాశాల డీన్ డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.