మోదీ, అమిత్‌షా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు.

మోదీ, అమిత్‌షా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు.

చిల్పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం

ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం.. ఎన్నికల సంఘం అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్

చిల్పూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు): 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాలు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు మేరకు చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు చిర నాగరాజు అధ్యక్షతన కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, మోదీ, అమిత్‌షా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల్లో ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేశ్వర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓట్ల చోరీకి పాల్పడేందుకు ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్, జిల్లా నాయకుడు బొమ్మిశెట్టి బాలరాజు, సర్పంచులు ఎనగందుల నరసింహారెడ్డి, భూక్య వెంకటేష్, చిల్పూర్ గుట్ట డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ ఎన్నకూస కుమార్, జిల్లా నాయకులు కర్నాల యాదగిరి, కన్యబోయిన రవి, సంఘీ నరసయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News