రూ.2 కోట్లతో నిర్మించిన స్టేడియం నిరుపయోగం.

రూ.2 కోట్లతో నిర్మించిన స్టేడియం నిరుపయోగం.

స్టేషన్ ఘన్‌పూర్‌లో క్రీడాకారుల ఆవేదన

ఒక్కరోజే మ్యాచ్‌లు.. ఆ తర్వాత మూత

విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాలు కరువుస్టేషన్

ఘన్‌పూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నమిలిగొండ వెళ్లే మార్గంలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియం నిరుపయోగంగా మారింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన స్టేడియంలో ఒక్కరోజు మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించి, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో క్రీడాకారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన ఫ్యాన్లు, క్రీడా పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి. తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేడియానికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం మరో సమస్యగా మారింది.

అదేవిధంగా స్టేడియం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, మైదానం చదును చేయడం, సూచిక బోర్డు ఏర్పాటు, వాలీబాల్ కోర్టు, పరుగు పందెం ట్రాక్ తదితర పనులు పూర్తికాకపోవడంతో అసంపూర్తి దశలోనే ఉంది. దీంతో పోలీస్, సైనిక ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు శిక్షణ తీసుకునేందుకు అనువైన వాతావరణం లేకుండా పోయింది.ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రీడా మైదానం వినియోగంలోకి రాకపోవడంపై క్రీడాకారులు, యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకువస్తే స్థానిక యువతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి స్టేడియం పరిస్థితిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని క్రీడాకారులు,IMG-20261008-WA0015 యువత కోరుతున్నారు. స్టేడియానికి విద్యుత్, తాగునీరు, రహదారి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News