భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ.
జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు.
Views: 4
On
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన రేవెల్లి తిరుపతి ఈ నెల 6న మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా, ఆయన భార్య రేవెల్లి దేవిక అలియాస్ రాణి ఇంట్లోని అల్మారా నుంచి రూ.2 వేల నగదు, మూడు తులాల వెండి వస్తువులు, దుస్తులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరుపతి నిద్రలేచి చూసేసరికి భార్య ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments