నిరవధిక సమ్మెకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమాయత్తం.

నిరవధిక సమ్మెకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమాయత్తం.

వనపర్తి,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు): 

జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం సంయుక్త కార్యాచరణ కమిటీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రమోహన్‌కు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు.సుమారు 17 వేల మంది జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ ఉద్యమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లో న్యాయం చేయాలని, వేతన సవరణ అమలు చేయాలని, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేతన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి సంవత్సరం రావాల్సిన వార్షిక వేతన పెంపుదలలు కోల్పోతున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలకంగా సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ విభాగం వైద్యులు, సంయుక్త కార్యాచరణ కమిటీ సమన్వయకర్త పరశురాముడు, ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది, వ్యాధి నిరోధక విభాగం సిబ్బంది, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News