పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం ఖాయం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం ఖాయం.

నిరుద్యోగులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది

బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జోగు వినయ్‌కుమార్‌

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు): 

వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయం ఖాయమని బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జోగు వినయ్‌కుమార్‌ అన్నారు. స్టేషన్‌ ఘనపూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని వినయ్‌కుమార్‌ ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్‌ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కూడా లేదని ఆయన మండిపడ్డారు.

గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఓటమి చెందినప్పటికీ నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు, పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని వినయ్‌కుమార్‌ అన్నారు. అనునిత్యం నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి విజయదుందుభి మోగించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News