బీటీ రోడ్డు పూర్తి.. గ్రామాల ప్రజల్లో హర్షం.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ నుంచి మంగంపల్లి అల్వాల సర్కిల్ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో ఏళ్లుగా సరైన రహదారి లేక రైతులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారి రాకపోకలకు అంతరాయం కలిగేది. పంటల తరలింపు, అత్యవసర ప్రయాణాల్లోనూ ఇబ్బందులు తప్పేవి.తాజాగా రహదారి నిర్మాణం పూర్తవడంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు, ప్రజలు సమీప గ్రామాలు, మండల కేంద్రాలకు చేరుకునేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments