టీబీ రహిత గ్రామంగా గట్ల ఖానాపూర్.
వైద్యాధికారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచ్.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు):
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 2025 సంవత్సరానికి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామపంచాయతీ ఎంపికైంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సి. గులాబీ రాణి, పంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. క్షయరహిత సమాజ నిర్మాణమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలో క్షయ వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలకు గట్ల ఖానాపూర్ గ్రామపంచాయతీ ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments