విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం.

వేంసూరు, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు): 

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వేంసూరులోని ప్రభుత్వ ఎస్సీడీడీ బాలుర వసతిగృహంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తిమ్మిడి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, ఏఎన్‌ఎం మౌనిక, ఆశా కార్యకర్తలు హిమంజలి, కె.అరుణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తిమ్మిడి నాగరాజు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News