పీచర జెడ్పీఎస్‌ఎస్   హైస్కూల్లో విద్యార్థులకు షూస్ పంపిణీ.

పీచర జెడ్పీఎస్‌ఎస్   హైస్కూల్లో విద్యార్థులకు షూస్ పంపిణీ.

 వేలేరు, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్  హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉచిత షూస్ పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జితేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, పాఠశాల చైర్మన్ మండల ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News