కిసాన్ నగర్‌లో కాషాయ జోష్.బండి సంజయ్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.

కిసాన్ నగర్‌లో కాషాయ జోష్.బండి సంజయ్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.

*గంగుల కమలాకర్ వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని బీజేపీ నేతల విమర్శ*

*కిసాన్ నగర్ గడ్డ.. బండి సంజయ్ అడ్డా: సాయిని మల్లేశం*

*కేంద్ర నిధులతోనే కిసాన్ నగర్ అభివృద్ధి: యాదగిరి సునీల్ రావు*

కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కిసాన్ నగర్‌లో గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుంచి చింతల వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ కిసాన్ నగర్‌తో బండి సంజయ్‌కు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. బీజేపీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు కిసాన్ నగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారిందన్నారు. కిసాన్ నగర్ ప్రజలకు బండి సంజయ్‌పై ఉన్న ఆదరణను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మార్చలేవని పేర్కొన్నారు. “కిసాన్ నగర్ గడ్డ అంటేనే బండి సంజయ్ అడ్డా” అని అన్నారు.

బీజేపీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ప్రజల మద్దతు బీజేపీకి కొనసాగుతుందని తెలిపారు.

బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. అమృత్-1, అమృత్-2, స్మార్ట్ సిటీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా కేంద్రం నుంచి కరీంనగర్‌కు నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు.

కిసాన్ నగర్‌లో రోడ్లు, వీధిదీపాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి స్మార్ట్ సిటీ నిధులతోనే జరిగిందని సునీల్ రావు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

గత మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని గంగుల కమలాకర్‌పై సునీల్ రావు విమర్శలు చేశారు. తిరిగి ప్రజల్లోకి వచ్చి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కిసాన్ నగర్ అభివృద్ధిపై జరుగుతున్న ప్రచారంలో కేంద్ర నిధుల పాత్రను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, ఐటీ టవర్, మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి అభివృద్ధి అంశాలపై ప్రజలు గత హామీలు, పనుల ఫలితాలను బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కీలకమని, దాని ద్వారా జరిగిన పనులకు బండి సంజయ్ కృషి కారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, కిసాన్ నగర్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.IMG-20261008-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News