బతుకమ్మ, దసరా వేడుకలపై మేయర్ ప్రత్యేక దృష్టి.

బతుకమ్మ, దసరా వేడుకలపై మేయర్ ప్రత్యేక దృష్టి.

*గతం కంటే వైభవంగా ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం*

*పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి*

 *మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు.. అధికారులకు మేయర్ ఆదేశాలు*

*ఉత్సవాల కోసం రూ.2.80 కోట్ల నిధుల కేటాయింపులు: మేయర్ కొలగాని శ్రీనివాస్* 

కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాల అధికారులు, సిబ్బందితో ఉత్సవాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. నగరంలోని 66 డివిజన్లలో బతుకమ్మ పాయింట్లు, నిమజ్జనం ప్రాంతాలు, అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్, పారిశుధ్య పనులతో పాటు ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేలా అన్ని ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉత్సవాల కోసం సుమారు రూ.2.80 కోట్ల నిధులు కేటాయించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

నగరవ్యాప్తంగా మెరుగైన పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీటి వసతి, బతుకమ్మ పాయింట్ల వద్ద చదును, మరమ్మతులు, నిమజ్జనం పాయింట్ల వద్ద బారికేడింగ్, అదనపు లైటింగ్, స్టేజీలు, జనరేటర్లు, మహిళల భద్రత తదితర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్పొరేటర్ల సలహాలు, సూచనలు స్వీకరించి వారి సమన్వయంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, IMG-20261008-WA0028అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఇన్‌చార్జి ఈఈ లచ్చిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News