ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.!
జిల్లా కలెక్టర్ దివాకర్ హామీ.
సత్తుపల్లి,అక్టోబరు 8(తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ హామీ ఇచ్చారు. ఖాబ్రస్తాన్ భూమికి సంబంధించి కొన్నేళ్లుగా అటవీశాఖ అధికారులు, ముస్లిం సమాజం మధ్య కొనసాగుతున్న సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థలానికి సంబంధించిన వివరాలను ఆయన కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్‌తో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో అజయ్ యాదవ్, తహసీల్దార్, ఎంపీడీవో, అటవీశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Comments