ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం ఆగదు.
Views: 0
On
*జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి*
*అవసరమైతే ఆమరణ దీక్షకు సిద్ధం: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి*
కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
ముకరంపురలోని తన కార్యాలయం వద్ద మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం, ఎన్నికల సంఘం వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శాంతియుత నిరసనపై పోలీసుల చర్యలను ఆయన ఖండించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments