వార్డు మెంబర్ల ఐక్యతే ప్రజా సమస్యలకు పరిష్కారం.

చిల్పూర్‌లో ఫోరం నూతన కమిటీ నియామకాలు.

వార్డు మెంబర్ల ఐక్యతే ప్రజా సమస్యలకు పరిష్కారం.

చిల్పూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు చిల్పూర్ మండల నూతన కమిటీని నియమించారు. జనగామ జిల్లా ఇన్‌చార్జి చెప్యాల మహిపాల్ రెడ్డి, కో-ఇన్‌చార్జి గుండేటి రామచందర్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి నాగబండి సంతోష్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు.
చిల్పూర్ మండల ఇన్‌చార్జిగా వడ్డేపల్లి పవన్, సమన్వయకర్తగా మాటూరి రాజశేఖర్, సహ ఇన్‌చార్జిలుగా లింగనబోయిన మహేష్, పంగ రవిబాబు, కస్తూరి వెంకటేష్‌లను నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఫోరం బలోపేతం, వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారం, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. వార్డు మెంబర్లంతా ఐక్యంగా పనిచేస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయవచ్చని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News