వేలేరు మండల మీడియా కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎం.డి. షరీఫ్
వేలేరు, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల మీడియా ప్రతినిధుల సమావేశం బుధవారం నిర్వహించగా, మండల మీడియా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఐక్యత, సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, మీడియా ప్రతినిధుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
ఈ ఎన్నికల్లో మండల మీడియా కమిటీ అధ్యక్షుడిగా ఎం.డి. షరీఫ్, ఉపాధ్యక్షుడిగా మంతపురి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చిట్టిమల్ల చందర్, కార్యదర్శిగా రేసు మధు, కోశాధికారిగా కొయ్యడ రాజు, సహాయ కార్యదర్శిగా రేణుకుంట్ల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా సలహాదారుగా ఇజ్జగిరి లింగం ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా మొగిలిచర్ల శ్రీనివాస్, గొల్లెన శ్రీకాంత్, కుంట రాకేష్, కొయ్యడ అక్షయ్, చిట్యాల రమేష్, పెసరు ఆగయ్య, మాటూరి శివ, కొట్టే శ్రీధర్ కొనసాగనున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వేలేరు మండలంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. మీడియా ప్రతినిధుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు


Comments