పెద్దమందడిలో పంట పొలాల్లో ముసలి కలకలం.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని పంట పొలాల్లో ముసలి సంచరిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముసలిని గుర్తించిన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు, స్నేక్ సొసైటీ నిర్వాహకులు కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు కృష్ణసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా ముసలిని పట్టుకున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ల సహకారంతో ముసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.ముసలి పట్టుబడటంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments