విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి.

విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి.

*వివేకానంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డేలో విద్యార్థులకు మేయర్ దిశానిర్దేశం*

*తన గురువులను,పూర్వ విద్యార్థులను సత్కరించిన మేయర్.*

కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

నగరంలోని రేకుర్తి రాజశ్రీ ఫంక్షన్ హాల్‌లో వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వివేకానంద డిగ్రీ కళాశాల ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలుIMG-20261008-WA0019 ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మేయర్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. వివేకానంద డిగ్రీ కళాశాలలో చదువుకొని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పూర్వ విద్యార్థులకు మేయర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సత్కరించింది.

ఒకప్పుడు ఇదే కళాశాలలో విద్యార్థిగా చదువుకున్న మేయర్ కొలగాని శ్రీనివాస్.. తన విద్యార్థి జీవితంలో జ్ఞానాన్ని అందించిన గురువులను శాలువాలతో ఆత్మీయంగా సత్కరించారు. తన విద్యార్థి దశలోని అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకుని వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. కష్టపడి చదువుతూ, నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని తెలిపారు. విద్యార్థి దశలోనే మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్, సెక్రటరీ, కరస్పాండెంట్ వి. ఆగం రావు, త్రీ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమల్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News