డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.

డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.

*స్వచ్ఛ భారత్ మిషన్‌లో రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులు – మేయర్ కొలగాని శ్రీనివాస్*

కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్ యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్‌లో డంపింగ్ యార్డు ప్రక్షాళనకు రూ.17 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా గురువారం మేయర్ 52వ డివిజన్‌లో పర్యటించారు. క్రిస్టియన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ సరిల్ల రాజకుమారి ప్రసాద్‌తో కలిసి రూ.24 లక్షల నిధులతో చేపట్టనున్న ఎస్‌డబ్ల్యూజీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో తమ పాలకవర్గం ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో కేటాయించిన రూ.17 కోట్లతో త్వరలోనే బయోమైనింగ్ పనులు ప్రారంభించి డంపింగ్ యార్డులోని చెత్తను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

బండి సంజయ్ కుమార్ సూచన మేరకు ఆడబిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా ఉత్సవాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News