టీబీ రహిత పంచాయతీగా కొండపాకకు గోల్డ్‌ సర్టిఫికెట్‌.

టీబీ రహిత పంచాయతీగా కొండపాకకు గోల్డ్‌ సర్టిఫికెట్‌.

వీణవంక, అక్టోబర్‌ 08 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామ పంచాయతీ టీబీ రహిత పంచాయతీగా గోల్డ్‌ సర్టిఫికెట్‌ సాధించింది. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా పంచాయతీ సాధించిన ఈ గుర్తింపును గ్రామ సర్పంచ్‌ దాట్ల వీరాస్వామి అందుకున్నారు.
డిప్యూటీ మేయర్‌, డీపీఓ, డీఎంహెచ్‌ఓ, ఎంపీడీఓల చేతుల మీదుగా సర్పంచ్‌ వీరాస్వామి గోల్డ్‌ సర్టిఫికెట్‌ను స్వీకరించారు. గ్రామంలో టీబీ వ్యాధి నియంత్రణకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, అనుమానిత కేసుల గుర్తింపు, పరీక్షలు, చికిత్స అందించడంలో తీసుకున్న చర్యలకు ఈ గుర్తింపు లభించినట్లు సర్పంచ్‌ తెలిపారు.
కొండపాకను టీబీ రహిత పంచాయతీగా తీర్చిదిద్దడంలో సహకరించిన వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలకు సర్పంచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామంలో టీబీ నిర్మూలనకు సమష్టిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News