టీబీ ముక్తి పంచాయతీగా అమ్మపల్లి.
జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచ్.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామపంచాయతీ టీబీ ముక్తి పంచాయతీగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గౌనీ మాధవి వెంకటేశ్వర రెడ్డి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.గ్రామంలో టీబీ వ్యాధి నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు, అనుమానితుల గుర్తింపు, చికిత్సకు సంబంధించిన చర్యల్లో భాగస్వామ్యమైన పంచాయతీ ప్రతినిధులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. టీబీ రహిత సమాజం కోసం గ్రామస్థాయిలో సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మధుసూదన్ గౌడ్, ఏఎన్‌ఎం సుజాత, పెద్దమందడి మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments