ఆపదలో నేనున్నానంటూ.. వెంకటేశ్వర్లుకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ
కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి చొరవ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారం.
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు):
అనారోగ్యంతో బాధపడుతున్న చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన సంగ వెంకటేశ్వర్లుకు వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరయ్యేలా బీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి చొరవ చూపారు. వెంకటేశ్వర్లు తన అనారోగ్య సమస్యను రాకేశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి విషయం వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే అందించిన ఎల్‌ఓసీ పత్రాన్ని కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వెంకటేశ్వర్లుకు అందజేశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనారోగ్య సమయంలో స్పందించి ఆర్థిక భరోసా కల్పించిన కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డికి, సహకరించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రంగు హరీశ్‌గౌడ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.


Comments