చల్లూర్‌లో ఇసుక లారీలతో ఇక్కట్లు..!

రోడ్డుపైనే వాహనాల నిలిపివేత.. రాకపోకలకు తీవ్ర అంతరాయం.

చల్లూర్‌లో ఇసుక లారీలతో ఇక్కట్లు..!

వీణవంక, అక్టోబర్‌ 08 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్‌ గ్రామంలో ఇసుక లారీల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చల్లూర్‌–మల్లారెడ్డిపల్లి రూట్‌లో ఇసుక లారీలను రోడ్డుపైనే నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇసుక క్వారీ వద్ద సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో డ్రైవర్లు రహదారిపైనే వాహనాలను నిలుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదే పరిస్థితి చల్లూర్‌–కోర్కల్‌, చల్లూర్‌–మామిడాలపల్లి రూట్లలోనూ నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. భారీ వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ఇతర వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని అంటున్నారు.క్వారీ వద్ద ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇసుక క్వారీ నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డుపై లారీలను నిలపకుండా అధికారులు చర్యలు తీసుకుని రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News