జిల్లా పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డికి ఘన సన్మానం.
Views: 6
On
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు):
వంగాలపల్లి గ్రామపంచాయతీకి విచ్చేసిన జిల్లా పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డిని గ్రామపంచాయతీ తరఫున ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ భూక్య మేనక శాలువాతో డీపీఓ వెంకట్‌రెడ్డిని సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామ సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరూరి రవిచందర్, మండల పంచాయతీ అధికారి రఘురామకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Oct 2026 21:11:15
జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో ఓ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....


Comments