టీబీ ముక్త్ గ్రామాలుగా శ్రీపతిపల్లి, ఫతేపూర్, వెంకటేశ్వరపల్లి.
కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్‌లకు అవార్డులు.
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు):
క్షయ వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, ఫతేపూర్, వెంకటేశ్వరపల్లి గ్రామాలు టీబీ ముక్త్ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు నీల కరుణాకర్, గుగులోతు లక్ష్మీ ఊమ్ల నాయక్, శివరాత్రి రేణుక వీరస్వామి అవార్డులు అందుకున్నారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజల సమష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైందని సర్పంచ్‌లు తెలిపారు. టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో కిరణ్ ప్రసాద్ ఆయా గ్రామాల సర్పంచ్‌లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments