ఘనపూర్‌లో శరన్నవరాత్రి సంబరాలకు సర్వం సిద్ధం!
ఈ నెల 11 నుంచి 20 వరకు దేవీ మహోత్సవాలు
మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు నిర్వాహకుల ఆహ్వానం
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని శివాలయం ఎదురుగా ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
మహోత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఉత్సవాల నిర్వాహకులు బ్రహ్మశ్రీ నర్సింగోజు బ్రహ్మచార్యులు స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ బండ్ల రాధాకృష్ణలను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కొలిపాక సతీష్, నితిన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments