జనగామకు ప్రథమ షీల్డ్ తీసుకురావాలి!

షూటింగ్‌బాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ.

జనగామకు ప్రథమ షీల్డ్ తీసుకురావాలి!

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): 

జిల్లా స్థాయి షూటింగ్‌బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులకు జిల్లా చైర్మన్ గద్దె అనిల్ కుమార్ క్రీడా టీ-షర్టులను పంపిణీ చేశారు. మెదక్ జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జనగామ జిల్లాకు ప్రథమ షీల్డ్ తీసుకురావాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రవాణా సంస్థ సభ్యుడు సిల్వర్ అభి గౌడ్ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని సూచించారు. జనగామ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఈ సందర్భంగా నాయకులు అభినందించి, పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు చేపూరి ప్రభాకర్, షేక్ బాబా, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.